News October 8, 2025

క్లచ్ చెస్ టోర్నీ: పోటీ పడనున్న దిగ్గజాలు

image

నేడు USAలో క్లచ్ చెస్ టోర్నీ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ గాస్పరోవ్(రష్యా) ఇందులో తర్వాత పోటీ పడనున్నారు. ఈ దిగ్గజాలు ఇప్పటివరకు పోటీ పడిన గేమ్స్‌లో కాస్పరోవ్‌దే‌పై చేయి. మరోవైపు వరల్డ్ నం.1 కార్ల్‌సన్, భారత ప్లేయర్ గుకేశ్ ఈ టోర్నీలో తలపడనున్నారు. అన్ని ఫార్మాట్లలో గుకేశ్‌పై కార్లసన్‌దే ఆధిపత్యం ఉంది.

Similar News

News February 15, 2026

హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారా? కెప్టెన్లు ఏమన్నారంటే?

image

T20WCలో భాగంగా భారత్, పాక్ జట్లు ఈరోజు తలపడనున్నాయి. కాగా పహల్గామ్ ఘటన తర్వాత భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్ ఇవ్వడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మ్యాచ్‌లో హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారా? అనే ప్రశ్నలకు ఇరు జట్ల కెప్టెన్లు నిన్న స్పందించారు. ‘ఇంకా టైముంది కదా.. టాస్ వేసే సమయానికి చూడండి’ అని సూర్య అన్నారు. అటు పాక్ కెప్టెన్ అఘా ‘దాని గురించి రేపు చూద్దాం’ అన్నారు.

News February 15, 2026

రైతుభరోసా ఒకే విడతలో.. ?

image

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

News February 15, 2026

పాకిస్థాన్‌కు ‘ధురంధర్’ డోస్!

image

T20 WCలో ఇవాళ కొలంబో వేదికగా జరగనున్న IND, PAK మ్యాచుకు ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారని జాతీయ క్రీడా వర్గాలు తెలిపాయి. ఇందులో ‘ధురంధర్’ సినిమా పాటల్ని ప్లే చేస్తారని, ర్యాపర్ హనుమాన్‌కైండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి. పాక్‌, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈరోజు ఆ టీమ్‌తో పాటు PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీకి ‘ధురంధర్’ డోస్ తప్పేలా లేదు.