News November 30, 2024

CM చంద్రబాబుకు ఎమ్మెల్సీ లేఖ 

image

ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘కొంతమంది అక్రమార్కులకు రూ.కోట్ల రూపాయలను సంపాదించే ఆదాయ వనరుగా రేషన్ బియ్యం మారింది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దందా కొనసాగుతోంది. చాలా మంది రేషన్ డీలర్లకే బియ్యాన్ని రూ.10కి ఇచ్చేస్తున్నారు’ అని చెప్పారు.

Similar News

News February 11, 2026

కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన కడప ఎంపీ

image

ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్‌లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్సప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్సప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.

News February 11, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో బుధవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.15,920
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,646
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,705.

News February 11, 2026

అరకప్పు కాఫీకి కాడు అభివృద్ధి కోసం పని చేయండి: కడప కలెక్టర్

image

ప్రొద్దుటూరు అభివృద్ధి సమీక్షలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అరకప్పు కాఫీ కోసం కాకుండా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పొద్దుటూరు మున్సిపల్ అధికారులకు చురకలు అంటించారు. ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు 1/2 టీ కోసం గొడవ పడి, హోటల్ ర్యాంప్ కూల్చివేతకు జేసీబీ తీసుకెళ్లారు. ఈ ఘటనపై ACP నాగరాజును సస్పెండ్, ఛైర్మన్ వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేశారు.