News July 27, 2024

CM చంద్రబాబుకు హరిరామ జోగయ్య లేఖ

image

కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య పాలకొల్లులో శనివారం ఒక లేఖ రాశారు. గత టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అటకెక్కిందని, రిజర్వేషన్లపై పునరాలోచించాలని కోరారు. కూటమి ప్రభుత్వాన్ని కాపులు 99 శాతం ఓట్లు వేసి గెలిపించారని, పవన్ వల్ల కాపులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Similar News

News December 18, 2025

ధాన్యం కొనుగోలు పురోగతిపై జేసీ సమీక్ష

image

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని జేసీ రాహుల్ అన్నారు. జేసి ఛాంబర్‌లో గురువారం ధాన్యం కొనుగోలు పురోగతిపై అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై ధాన్యం సేకరణ కేంద్రాలు పనితీరు, రైతులు చెల్లింపులు లక్ష్యాలు, సాధనపై అడిగి తెలుసుకున్నారు.

News December 18, 2025

కోరుకొల్లులో సినిమా షూటింగ్ సందడి

image

పాలకోడేరు మండలం కోరుకొల్లులో గురువారం ‘తెల్ల కాగితం’ సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. హీరో రోషన్‌, హీరోయిన్‌ వైష్ణవిలపై దర్శకుడు రమేష్‌ పలు సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. చిత్ర విశేషాలు బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

News December 18, 2025

రైతు బజార్‌లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

image

భీమవరం రైతు బజార్‌లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్‌లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్‌కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.