News June 29, 2024
CM చంద్రబాబును కలిసిన నిడదవోలు మాజీ MLA

గత రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నగదు బకాయిలు చెల్లించాలని CM చంద్రబాబును నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కోరారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం బకాయిల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. స్పందించిన సీఎం త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News December 12, 2025
దివ్యాంగుడి సమస్య విన్న కలెక్టర్

భీమవరం మండలం గూట్లపాడుకి చెందిన గౌరీ శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశానికి వచ్చారు. వీరిని చూసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి దివ్యాంగుడు శంకర్ పరిస్థితిని చూసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉండడంతో దివ్యాంగ ఫించన్ రూ. 6 వేల వస్తోందని, వందశాతం అంగవైకల్యం ఉన్న తనకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని కోరాడు. ఈ అర్జీని కలెక్టర్ అధికారులకు సిఫార్సు చేశారు.
News December 12, 2025
నరసాపురం నుంచి వందేభారత్

నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15 న ముహూర్తం ఖరారయింది. ప.గో నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం – విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది. తిరిగి ఉ. 5.35కు బయలుదేరి మ.2.10కి నరసాపురంలో ఉంటుంది.
News December 12, 2025
భీమవరం: లింక్ క్లిక్.. సినిమా స్టైల్లో నగదు మాయం

భీమవరంలోని శివరావుపేటకు చెందిన శ్రీరామదాసు సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్కు వచ్చిన లింక్పై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి సినిమాలో చూపించే తరహాలో రూ.1,70,400 ఐదు దఫాలుగా వెంట వెంటనే కట్ అయిపోయాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. భీమవరం టూటౌన్ సీఐ కాళీచరణ్ అకౌంట్లలో ఉన్న రూ.90 వేలు ఫ్రీజ్ చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


