News February 25, 2025
CM చిత్తూరు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..

సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. మార్చి 1న ఆయన జీడీనెల్లూరుకు రానున్నారు. శనివారం 11.25కి రేణిగుంటకు వస్తారు. 11.50కి హెలికాప్టర్ ద్వారా జీడీనెల్లూరుకు వెళ్తారు. అక్కడ పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత గ్రామస్థులతో మాట్లాడతారు. 2.30 తర్వాత తిరిగి రేణిగుంట వెళ్తారు. ఈనేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News March 26, 2025
చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న భానుడు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉ.11కే భానుడు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం తవణంపల్లెలో దాదాపు 40, గంగవరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరులో 38, నగరిలో 37, పలమనేరులో 37.5, కుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.
News March 26, 2025
చిత్తూరు జిల్లాలో RIలకు పదోన్నతి

చిత్తూరు జిల్లాలో RIలకు DTలుగా పదోన్నతిని కల్పిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ☞ పెద్దపంజాణి డీటీ-యుగేశ్☞ ఇనాం డీటీ-రాజశేఖర్☞ పుంగనూరు ఎన్నికల డీటీ-మోహన్ ☞ చౌడేపల్లి డీటీ- నందినిదేవి☞ కుప్పం సీఎస్టీ-రేఖ ,జోత్స్న ☞ కుప్పం ఈడీటీ- జోత్స్న☞ పలమనేరు సీఎస్‌ఈటీ-శిరీష☞ కుప్పం రీసర్వే డీటీ-నరేంద్ర☞ వీకోట రీసర్వే డీటీ-శోభ ☞ సోమల డీటీగా మధుసూదన్‌కు పోస్టింగ్ ఇచ్చారు.
News March 26, 2025
కార్వేటి నగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

బొలెరో వాహనం ఢీకొని కార్వేటి నగరం మండలానికి చెందిన యువకుడు మంగళవారం మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. కేపీ అగ్రహారానికి చెందిన రవి(26) తిరుపతిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైకుపై వస్తుండగా వెదురుకుప్ప మండలం చిన్నపోడు చేను సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.