News April 25, 2024
CM పర్యటన నేపథ్యంలో పులివెందులలో ట్రాఫిక్ ఆంక్షలు

CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్కు వెళ్తాయన్నారు.
Similar News
News October 28, 2025
అప్రమత్తతతో సహాయక చర్యలపై దృష్టి సారించండి: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టంపై అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను వర్షాల పరిస్థితులను ఎదుర్కొనే సహాయక చర్యలు, సంసిద్ధతపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
కడప: రాష్ట్రస్థాయి టోర్నీకి ఎంపికైన IIIT విద్యార్థి

గుంటూరు జిల్లా తెనాలిలో ఈనెల 30 నుంచి నవంబర్ 1 వరకు బాయ్స్ అండర్ – 17 విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో కడప జిల్లా జట్టుకు ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్కేవ్యాలీ ట్రిపుల్ఐటీ పీయూసీ విద్యార్థి జి. తంగరాజ్ జిల్లా జట్టులో చోటు సాధించాడు. ఈ సందర్భంగా ఆర్కేవ్యాలీ ఫిజికల్ డైరెక్టర్ రమణారెడ్డి, తదితరులు అభినందించారు.
News October 28, 2025
తుఫానుపై ఆందోళన వద్దు: కడప ఇన్ఛార్జ్ కలెక్టర్

తుఫాను ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదిదిసింగ్ సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం ఆమె టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర చర్యలకు కడపతోపాటు RDO కార్యాలయాలన్నింటిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


