News November 8, 2024

CM, పవన్‌పై అసభ్య పోస్టులు.. ఒకరి అరెస్ట్

image

సీఎం చంద్రబాబు, DY CM పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌పై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన యువకుడు అరెస్ట్ అయిన ఘటన ఉమ్మడి ప.గో జిల్లాలో వెలుగు చూసింది. గోపాలపురం SI సతీశ్ కుమార్ వివరాల ప్రకారం.. రంగంపేట మండలానికి చెందిన వీరాబత్తుల చంద్రశేఖర్ సోషల్ మీడియాలో సీఎం, పవన్, ఇతర మంత్రుల
ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. పార్టీల మధ్య విభేదాలు, కార్యకర్తల మధ్య గొడవలు వచ్చేలా పోస్టులు పెట్టడంతో గురువారం అరెస్ట్ చేశారు.

Similar News

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.