News October 4, 2024

CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు: నిఖత్ జరీన్

image

TG పోలీసు శాఖలో DSP పదవితో సత్కరించినందుకు CM రేవంత్ రెడ్డికి బాక్సర్ నిఖత్ జరీన్ ‘X’ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాఠీని అందుకున్న ఫోటోలను జత చేసిన ఆమె.. క్రీడలు తనకు మంచి వేదికను అందించాయని తెలిపారు. ఆ స్ఫూర్తి తనకు మరింత సామర్థ్యంతో సేవ చేయడానికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది తన విజయం మాత్రమే కాదని సమిష్ఠి విజయమని పోస్టు చేశారు.

Similar News

News January 2, 2025

NZB: జస్టిస్ షమీం అక్తర్‌ను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు

image

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎస్సీ వర్గీకరణ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ శమీమ్ అక్తర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. జిల్లా కేంద్రానికి అధికారిక పర్యటన నిమిత్తం చేరుకున్న సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూలు జగన్ మోహన్ గౌడ్, బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ ప్రభుత్వ అతిధి గృహంలో కలిసి పూలమాలలు అందజేశారు.

News January 2, 2025

NZB: సమగ్ర నివేదిక సమర్పిస్తాం: జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్

image

ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని ఏకసభ్య కమిషన్ ఛైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాలలో అందరి అభిప్రాయాలను సేకరించిన మీదట ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

News January 2, 2025

ఆర్మూర్: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

image

చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన ఆలూర్ మండలం దేగాం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆర్మూరు సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశవ్ గంగాధర్ అనే వ్యక్తి ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి 6 నెలల క్రితం బతుకుదెరువు కోసం వచ్చాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నీటి కాలువలో చేపలు పట్టడానికి వెళ్లగా ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.