News January 27, 2025
CM రేవంత్ రెడ్డికి మెదక్ రైతు THANKS

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా డబ్బులు బ్యాంకులో పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దేవసత్ బద్యానాయక్ అనే రైతుకు రూ.7 వేలు అకౌంట్లో జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో దామలచెరువులో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 11, 2026
ఇతిహాసాలు క్విజ్ – 124 సమాధానం

ప్రశ్న: కురుక్షేత్రంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?
సమాధానం: నాగలి ఆయుధం గల బలరాముడికి కౌరవ, పాండవులిద్దరూ సమానులే. అందుకే ఆయనకు యుద్ధం ఇష్టముండదు. ఓవైపు కృష్ణుడు ప్రాతినిధ్యం వహించే పాండవ సేన, మరోవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడి కౌరవ సేన.. ఇద్దరూ బంధువులే కావడంతో ఎవరి పక్షం వహించలేదు. యుద్ధానికి ముందు ఆయుధాలు వదిలి ప్రశాంతత కోసం సరస్వతీ నది తీరం వెంబడి తీర్థయాత్రలకు వెళ్లాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 11, 2026
నంద్యాల: ఈనెల 14న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

గడివేముల మండలం చిందుకూరులో సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 14న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. గెలుపొందిన టీములకు మొదటి బహుమతి రూ.20,000లు, రెండో బహుమతి రూ.15,000లు, మూడో బహుమతి రూ.10,000లు, నాలుగో బహుమతి రూ.7,000లు, ఐదో బహుమతిగా రూ.5,000లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
News January 11, 2026
ASF: పీడిత వర్గాల పోరాట యోధుడు ఓభన్న: కలెక్టర్

పీడిత వర్గాల పోరాట యోధుడు ఓభన్న అని కలెక్టర్ వెంకటేష్ దోత్రే కొనియాడారు. వడ్డే ఓభన్న జయంతిని ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీడిత ప్రజల ఆరాధ్య దైవం, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ఓభన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


