News December 4, 2024
CM రేవంత్ రెడ్డితో మంత్రి టీజీ భరత్ భేటీ

తెలంగాణ CM రేవంత్ రెడ్డిని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ‘స్ఫూర్తిదాయకమైన, కష్టంతో ఎదిగిన ఓ రాజకీయ నాయకుడిని కలవడం అదృష్టంగా భావిస్తున్నా. పట్టుదల, అంకితభావంతో కూడిన ప్రయాణం ఆయన శక్తికి నిదర్శనం. రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఆయన నాయకత్వం నన్ను ఆకట్టుకుంటోంది. ప్రజలకు సేవ చేయడంలో, సానుకూల ప్రభావం చూపడంలో ఆయన విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ టీజీ భరత్ పోస్ట్ చేశారు.
Similar News
News October 27, 2025
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News October 27, 2025
ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్దులు అవగాహన కల్గి ఉండటం మంచిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా డీపీఓలో ఏర్పాటుచేసిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. పోలీసు అమర వీరులను ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అన్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించామన్నారు.
News October 27, 2025
‘మొంథా’ తుఫాను: ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

‘మొంథా’ తుపాను నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. తుఫాను సంసిద్ధతపై సోమవారం అధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు అవసరమైనప్పుడు వివిధ శాఖలకు సంబంధించిన మానవ వనరులు (మెన్), సామగ్రి (మెటీరియల్) పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.


