News December 4, 2024
CM రేవంత్ రెడ్డితో మంత్రి టీజీ భరత్ భేటీ
తెలంగాణ CM రేవంత్ రెడ్డిని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ‘స్ఫూర్తిదాయకమైన, కష్టంతో ఎదిగిన ఓ రాజకీయ నాయకుడిని కలవడం అదృష్టంగా భావిస్తున్నా. పట్టుదల, అంకితభావంతో కూడిన ప్రయాణం ఆయన శక్తికి నిదర్శనం. రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఆయన నాయకత్వం నన్ను ఆకట్టుకుంటోంది. ప్రజలకు సేవ చేయడంలో, సానుకూల ప్రభావం చూపడంలో ఆయన విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ టీజీ భరత్ పోస్ట్ చేశారు.
Similar News
News January 17, 2025
BREAKING: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాలకుర్తి వద్ద లారీ టైర్ పేలి కారుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 17, 2025
కర్నూలుకు పెట్టుబడుల క్యూ.. కారణమిదే!
☞ ఓర్వకల్లు విమానాశ్రయం ఉండటం
☞ ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో అందుబాటులో భూమి
☞ హైదరాబాద్- బెంగళూరు నగరాలకు మెరుగైన రవాణా సౌకర్యం
☞ సీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం
☞ నీటి వనరుల అనుకూలం
☞ సంస్థలకు త్వరితగతిన అనుమతులు
☞ ఓర్వకల్లు విమానాశ్రయంలోని రన్‌వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకునే అవకాశం
☞ కర్నూలు ఎమ్మెల్యే పరిశ్రమల శాఖ <<15167493>>మంత్రిగా<<>> ఉండటం
News January 17, 2025
ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,632
ఆదోని మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,632 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 1,785 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,632, సరాసరి రూ.7,389, కనిష్ఠ ధర రూ.5,580తో అమ్మకాలు జరిగాయి.