News October 20, 2024

CM సొంత నియోజకవర్గంలో విఫలమయ్యారు: కేటీఆర్

image

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు రుణాలు 40% కూడా మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News November 4, 2024

ఉమ్మడి జిల్లాకు నేడు వర్ష సూచన

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు, అధికారులకు ముందస్తు జాగ్రత్తలు సూచించింది.

News November 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✔Get Ready..75 ప్రశ్నలపై ఫోకస్✔NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి✔ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక✔NGKL:నీటి సంపులో పడి బాలుడి మృతి✔MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు✔నూతన ఉపాధ్యాయులకు సన్మానం✔Way2News క్లిక్.. పలుచోట్ల పొద్దున్నే కమ్ముకున్న పొగ మంచు✔కొత్తకోట:కారు,బైక్ ఢీ..వ్యక్తికి తీవ్రగాయాలు✔సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి:కాంగ్రెస్

News November 3, 2024

MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు

image

పాలమూరు విశ్వవిద్యాలయ పురుషుల తైక్వాండో జట్టు ఆల్ ఇండియా లెవెల్లో పాల్గొనడానికి ఆదివారం పంజాబ్‌కు బయలుదేరింది. ఈ పోటీలు పంజాబ్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన క్రీడాకారులు గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్‌సర్‌లలో నిర్వహించే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొంటారని PU PD డా.శ్రీనివాసులు తెలిపారు.