News December 14, 2025

CM చంద్రబాబుపై MLA చంద్రశేఖర్ సెటైర్లు

image

CM చంద్రబాబుపై YCP MLA చంద్రశేఖర్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘వరుస ఓటములతో ఇక ఫుట్‌బాల్ ఆడనన్నాడు. నేను దావోస్ వెళ్లినప్పుడు అర్జెంటీనా నుంచి వచ్చి కలిశాడు. ఆటలో చిట్కాలు చెప్పా. ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు మెస్సీ. HYD వస్తారా, నన్నే అమరావతి రమ్మంటారా అని ఫోన్లు. వీలైతే ఈసారి విశాఖలో లోకేశ్ టీమ్, నీ టీమ్‌కూ మ్యాచ్ పెడదామన్నాను, ఆనందపడ్డాడు. మీకు ఎవరైనా గుర్తొస్తే నాకు సంబంధం లేదు!’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 20, 2025

ఉద్యోగ యోగాన్ని కల్పించే ‘బెంగళూరు గణేష్’

image

బెంగళూరు జయనగర్‌లోని కెరీర్ వినాయక ఆలయం నిరుద్యోగుల పాలిట కల్పవృక్షం. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, పదోన్నతులు కోరేవారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి జరుగుతుందని నమ్మకం. సంకల్ప పూజలు, ప్రదక్షిణలతో నిరుద్యోగులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం. విద్యావంతులు, యువతతో ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి భరోసాను కల్పిస్తోంది.

News December 20, 2025

రూ.500 కోట్ల క్లబ్‌లో ‘ధురంధర్’

image

రణ్‌వీర్ సింగ్ ధురంధర్ వసూళ్ల వండర్ సృష్టించింది. INDలో విడుదలైన 15 రోజుల్లోనే రూ.500Cr కొల్లగొట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లోనూ 3వ స్థానానికి చేరింది. తొలి 2 స్థానాల్లో కాంతార ఛాప్టర్-1(రూ.622Cr), ఛావా(601Cr) ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.700Cr రాబట్టింది.

News December 20, 2025

వైస్ కెప్టెన్‌నే పక్కన పెట్టేశారు..

image

గత కొంతకాలంగా టీ20ల్లో రన్స్ చేయలేక విఫలం అవుతున్న గిల్‌ను బీసీసీఐ పక్కనబెట్టింది. వచ్చే ఏడాది జరగబోయే WCకు ఎంపిక చేయలేదు. ప్రస్తుత వైస్ కెప్టెన్, ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్న గిల్‌నే సెలక్ట్ చేయకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సరిగా ఆడకపోతే ఇదే సరైన ట్రీట్‌మెంట్ అని కొందరు సెలక్షన్ కమిటీని అభినందిస్తున్నారు. కాగా గిల్ గత 22 టీ20 ఇన్నింగ్సుల్లో 529 పరుగులే చేశారు. సగటు 26.45గా ఉంది.