News October 27, 2025
CM చంద్రబాబు పల్నాడు పర్యటన షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా నేడు పల్నాడు (D) వెల్దుర్తి రానున్నారు. షెడ్యూల్‌ను CM కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10:30కి ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. 11. 55 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12 గంటలకు హెలికాప్టర్‌లో వెల్దుర్తి బయలుదేరతారు. ఒంటి గంటకు MLA తనయుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని 1.10కి తిరిగి హెలికాప్టర్‌లో అమరావతి బయలుదేరతారు.
Similar News
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.
News October 27, 2025
యజ్ఞంలా కోటి సంతకాల సేకరణ: YCP

AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ యజ్ఞంలా సాగుతోందని YCP ట్వీట్ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంది. పార్టీ నేతలు YS అవినాశ్‌రెడ్డి, YS మనోహర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది. ప్రైవేటీకరణతో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారంది.
News October 27, 2025
మొంథా తుపాన్: విజయనగరానికి రూ.కోటి

మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు నిధులు కేటాయించింది. విజయనగరం జిల్లాకు రూ.కోటి, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ. 50లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో తీర ప్రాంతం ఉండడంతో నష్టం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నిధులను రూ.కోటి మంజూరు చేసింది. ఆయా నిధులను నష్టం నివారణకు ఖర్చు చేయాల్సి ఉంది.


