News June 29, 2024
CM పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు: గుంటూరు కలెక్టర్

జులై ఒకటో తేదీన తాడేపల్లి మండలం పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సందర్భంగా.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం రాత్రి ఆమె తన కార్యాలయంలో సీఎం పర్యటనపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News October 27, 2025
గుంటూరు జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

జర్మనీలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల కోసం మైనారిటీ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ, ఓఎంసీఏపీ, ఐఈఎస్ సంయుక్తంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం, వయస్సు 30 లోపు ఉండాలని అధికారులు తెలిపారు. మొత్తం ఖర్చు రూ.1.15 లక్షలు 3 వాయిదాల్లో చెల్లించాలి. ఆసక్తిగల వారు నవంబర్ 2లోపు naipunuam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 27, 2025
రాష్ డ్రైవింగ్‌పై గుంటూరు పోలీసుల ఉక్కుపాదం

రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై గుంటూరు పోలీసులు రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉక్కుపాదం మోపారు. ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 2లక్షల మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని
ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. హెల్మెట్ ధరించి, నిబంధనలు పాటించడం అందరి బాధ్యత అని చెప్పారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News October 27, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 75వేల బస్తాల ఏసీ సరకు అమ్మకానికి వచ్చింది. ఏసీ రకం మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్య ధరలు క్వింటాలుకు ఈ విధంగా ఉన్నాయి. పసుపు రకం: రికార్డు స్థాయిలో రూ.20 వేల నుంచి రూ. 23 వేల వరకు పలికింది. తేజా, 355, 341 రకాలు: రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు ధరలు నమోదయ్యాయి. నంబర్ 5 ఏసీ రకం గరిష్టంగా రూ. 15,500 వరకు ధర పలికింది. నాటు సూపర్ 10: రూ.15వేలు వరకు పలికింది.


