News January 29, 2026
CM రేపటి పర్యటన వివరాలు

సీఎం చంద్రబాబు జిల్లాలో శుక్రవారం పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. 30న మధ్యాహ్నం రెండు గంటలకు గుడిపల్లె హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 2.15 గంటలకు టీచర్స్ ట్రైనింగ్ బిల్డింగ్ ఓపెనింగ్, 3.15 ఆదిత్య బిర్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, గ్రంథాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 4.30 గంటలకు కంగుందిలో ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 5.55 గంటలకు శాంతిపురం మండలం, కడపల్లెలోని నివాసానికి చేరుకుంటారు.
Similar News
News February 19, 2026
మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News February 19, 2026
చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.
News February 19, 2026
చిత్తూరు: అంతా నాయకుల కనుసన్నల్లోనే.?

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కౌండిన్య, నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందట. తెలిసినా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొందట. కొందరు మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారట. గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన కొందరు నేతల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తవణంపల్లె-పూతలపట్టు సరిహద్దులోని నీవా నది ఓ బడా నేత ఆక్రమణల ధాటికి మౌలిక స్వరూపమే కోల్పోతోందట. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


