News October 29, 2025

CM సార్.. వికారాబాద్ జిల్లా ఏడుస్తోంది..!

image

వికారాబాద్ జిల్లా నుంచి CM రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, MLAలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా తన దీన స్థితి చూసి వికారాబాద్ జిల్లా ఏడ్చే దుస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ఏ మూల వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు. కనీసం రోడ్లు బాగు చేయని పాలకులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. పైఫొటో VKBలోని రైతుబజార్ సమీపంలోని రోడ్డు.

Similar News

News October 30, 2025

హుజూర్‌నగర్‌కు మూడు పేర్లు

image

హుజూర్‌నగర్‌కు పాతకాలంలో పురుషోత్తమపురి, పోంచర్ల అనే రెండు పేర్లు ఉండేవి. ఫణిగిరి గుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి వెలయడంతో ఈ ప్రాంతం పురుషోత్తమపురిగా పేరొందింది. ఆ తర్వాత ముత్యాలమ్మ (పోచమ్మ) దేవాలయం ఏర్పడటంతో పోంచర్లగా మారింది. నవాబుల పాలనలో దీనిని హుజూర్‌నగర్‌గా మార్చారు. ఈ రెండు ఆలయాలు నేటికీ ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉన్నాయి.

News October 30, 2025

జనగామ: నేడు పాఠశాలలకు సెలవు

image

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రేపు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్షలు నవంబరు 1వ తేదీన నిర్వహించాలని ఆయా పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు.

News October 30, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు ఫొటోగ్రఫీ & వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సంవత్సరాలవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు నవంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు 9502593347 నంబర్‌ను సంప్రదించవచ్చు.