News December 11, 2025
CM సొంత నియెజకవర్గంలో గ్రానైట్ అక్రమ రవాణా.?

అది CM సొంత నియోజకవర్గం. అన్నిరంగాల్లో ముందుడాలని చంద్రబాబు అభివృద్ధి అంటుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం అందినకాడికి దోచుకో.. దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారట. కుప్పం గ్రానైట్‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో నాయకులు పగలు గ్రావెల్ రాత్రిళ్లు గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారట. YCP హయాంలో చంద్రబాబు దీనిపై క్వారీలోకి వెళ్లి మరీ పరిశీంచారు. మరి ఇప్పటి అక్రమ రవాణాపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
Similar News
News February 20, 2026
ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ.1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.
News February 19, 2026
మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News February 19, 2026
చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.


