News March 30, 2024
సీఎం, 10మంది MLAలు ఏకగ్రీవం

అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. సీఎం పెమా ఖండూ సహా 10మంది BJP ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎంగా చౌనా మెయిన్ ఉండనున్నారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో ఖండూతో పాటు మరో 9మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రధాన ఎన్నికల అధికారి పవన్ కుమార్ సైన్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.
Similar News
News November 15, 2025
తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

తన ఫ్యూచర్(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్‌రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్‌పై చాలా ఫోకస్డ్‌గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్‌పై అతనికున్న ఫోకస్‌ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.
News November 15, 2025
కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News November 15, 2025
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,080కు చేరింది. కాగా రెండు రోజుల్లోనే రూ.3,540 తగ్గడం విశేషం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,800 పతనమై రూ.1,14,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,100 తగ్గి రూ.1,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


