News January 23, 2025
APలో చిప్ డిజైన్ కేంద్రం పెట్టాలని గూగుల్‌కు CM విజ్ఞప్తి

విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్‌ను CM CBN కోరారు. సర్వర్ల నిర్వహణలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ఆ సంస్థ క్లౌడ్ CEO థామస్ కురియన్ను రిక్వెస్ట్ చేశారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని DP వరల్డ్ సంస్థను, విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకోవాలని పెప్సికోను కోరారు. APని ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేలా సహకరించాలని బిల్ గేట్స్‌కు CM విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 11, 2025
US దారిలో మెక్సికో.. భారత్‌పై 50% టారిఫ్స్

ఏషియన్ కంట్రీస్ దిగుమతులపై గరిష్ఠంగా 50% టారిఫ్స్ విధించేందుకు మెక్సికో సెనేట్ అంగీకరించింది. ఈ నిర్ణయంతో ఇండియా, చైనా, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల 1400+ ఉత్పత్తులపై సుంకాలు 50% వరకు ఉండనున్నాయి. టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ పార్ట్స్, ప్లాస్టిక్స్, మెటల్స్, ఫుట్‌వేర్ ఇండస్ట్రీస్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. సెలక్టివ్ ఐటమ్స్‌పై 50%, అత్యధిక ఉత్పత్తులపై 35% వరకు టారిఫ్స్ ఉండనున్నాయి.
News December 11, 2025
పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News December 11, 2025
సూపర్ నేపియర్ గడ్డి పెంపకానికి సూచనలు

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.


