News April 8, 2025
సీఎం ఛైర్మన్గా జలహారతి కార్పొరేషన్

AP: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైస్ ఛైర్మన్గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఈఓగా జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఉండనున్నారు. పోలవరం వరద నీరు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లకు పైగా ఖర్చవుతుండగా, 3లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయని ప్రభుత్వ అంచనా.
Similar News
News April 17, 2025
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ డివైజ్లు డేటా చోరీకి గురి కాకుండా ఉండేందుకు IOS ఇనాక్టివిటీ రీబూట్ ఫంక్షన్ తరహాలో కొత్త ఫీచర్ రానుంది. 3 రోజులపాటు ఫోన్ లాక్ అయి ఉండడం లేదా ఉపయోగించకుండా ఉంటే ఫోన్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయి హై సెక్యూరిటీ మోడ్లోకి వెళ్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ ఫీచర్లు డిసేబుల్ అవుతాయి. ఫోన్ మళ్లీ వాడాలంటే పాస్ కోడ్ ఎంటర్ చేయాలి. గూగుల్ ప్లే సర్వీసెస్ వెర్షన్ 25.14తో ఈ ఫీచర్ రానుంది.
News April 17, 2025
భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.89,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగి రూ.97,310 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,10,100గా ఉంది. అతి త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
News April 17, 2025
మత్స్యకారులకు డబుల్ ధమాకా

AP: రాష్ట్రంలోని మత్స్యకారులకు వేట నిషేధ భృతి రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలకు మరో రూ.10 వేలు కలిపి రూ.20 వేలు ఇవ్వాలని భావించింది. దీంతో 1,22,968 మంది జాలర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. కాగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో జీవన భృతితోపాటు బియ్యం అందించనుంది.