News January 3, 2025

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం బ్యాడ్‌న్యూస్

image

TG: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశమే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అలా చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప, పరిష్కారం కాదని హితవు పలికారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. వారి సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News December 5, 2025

13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

image

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్‌ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్‌‌తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.

News December 5, 2025

పాన్ మసాలాలపై సెస్.. బిల్లుకు ఆమోదం

image

పాన్ మసాలాలపై సెస్ విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ద్వారా వీటి తయారీలో ఉపయోగించే యంత్రాలు, ప్రక్రియలపై సెస్ విధించనున్నారు. వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో(CFI) జమ చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. ప్రస్తుతానికి పాన్ మసాలాలపైనే సెస్ అని, అవసరమైతే ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

News December 5, 2025

కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

image

TG: నర్సంపేట సభలో మాజీ మంత్రి KTRపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘నిన్నమొన్న జూబ్లీహిల్స్‌లో ఒకడు తీట నోరు వేసుకొని తిరిగాడు. ఉపఎన్నిక రెఫరెండం.. రేవంత్ సంగతి తేలుస్తా అన్నాడు. అక్కడ చెత్తంతా రేవంతే వేస్తుండని ప్రచారం చేశాడు. ఇళ్లిళ్లు తిరిగి అందరి కడుపులో తలకాయ పెట్టిండు.. కాళ్లకు దండం పెట్టిండు. వీని తీట అణగాలని ఓటర్లు కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు’ అని విమర్శలు గుప్పించారు.