News March 6, 2025
సీఎం ప్రచారం చేసినా దక్కని విజయం!

TG: KNR-MDK-NZB-ADB ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నా, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించినా సిట్టింగ్ స్థానంలో గెలవకపోవడంతో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా తగ్గిందా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా తమకు పోయేదేం లేదని స్వయంగా రేవంత్ వ్యాఖ్యానించడమూ ఆ పార్టీ ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 29, 2025
క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

ఉత్తరాఖండ్ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ ఫైనాన్స్ జాబ్స్‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.