News June 28, 2024

సీఎం చంద్రబాబు అపర భగీరథుడు: మంత్రి సంధ్యారాణి

image

AP: ఉత్తరాంధ్రలోని తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టుల పెండింగ్ పనులను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ కోసం తోటపల్లి బ్యారేజ్ నుంచి ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేసిన తర్వాత ఆమె మాట్లాడారు. CM చంద్రబాబు అపర భగీరథుడని, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేశారని కొనియాడారు.

Similar News

News November 26, 2025

ప.గో జిల్లా.. భారీ వర్షాలు.. హెచ్చరిక

image

ప.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News November 26, 2025

ఆనంద నిలయం విశేషాలివే..

image

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 26, 2025

రాజ్యాంగం@76 ఏళ్లు

image

భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించనుండగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువుతారు. తర్వాత తెలుగు, తమిళం, మరాఠీ సహా 9 భాషల్లో డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.