News October 15, 2024
పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

AP: ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 13,326 గ్రామాలలో రూ.4,500 కోట్ల ఖర్చుతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టాలనే సంకల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కార్యరూపంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Similar News
News February 10, 2026
సూర్య అద్భుతమైన కెప్టెన్: గంభీర్

భారత T20 కెప్టెన్ సూర్యకుమార్‌పై కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘అతడు అద్భుతమైన నాయకుడు. బ్యాటర్‌గా ఓ వైపు అదరగొడుతూనే తోటి ఆటగాళ్లతో మంచి సంబంధాలను పెంచుకున్నాడు. జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాడు. దీంతో కోచ్‌గా నాకు ఈజీ అవుతోంది. అలాంటి వ్యక్తి టీమ్ ఇండియాను నడిపించడం గొప్ప విషయం. సూర్య ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’ అని కొనియాడారు. USAతో మ్యాచ్‌లో సూర్య చెలరేగడం తెలిసిందే.
News February 10, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News February 10, 2026
ఉపవాసం ఎందుకు ఉండాలి?

ఉపవాసం అంటే ఆహారం మానడం కాదు. మనస్సును దైవచింతనలో నిలపడం. సంకల్పించిన దేవతకు రోజును అంకితం చేయడం. ధ్యానం, పూజలు, మహిమల పఠనంలో గడపాలి. సహనంగా ఉండాలి. జంతువుల పట్ల దయ చూపాలి. శరీరం, మనస్సును శుద్ధిగా ఉంచాలి. శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. మాటలు, ఆలోచనలలో క్రూరత్వం, దురాశ వీడాలి. నిస్వార్థ పనులు చేయాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. వీలైతే మౌనంగా ఉండాలి.


