News October 1, 2024

పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ(M)లోని పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటిస్తున్నారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాసేపట్లో గ్రామ సభ నిర్వహించి ప్రసంగిస్తారు.

Similar News

News December 21, 2025

మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ఆసీస్ వశం

image

ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగుతోంది. మూడో టెస్టులోనూ ఆసీస్ 82 పరుగుల తేడాతో విజయం సాధించి మరో 2 టెస్టులు మిగిలి ఉండగానే యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో క్రాలీ(85), జేమీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39), రూట్(39) పరుగులు చేశారు.
స్కోర్లు: ఆసీస్ 371/10, 349/10; ఇంగ్లండ్ 286/10, 352/10

News December 21, 2025

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.

News December 21, 2025

సూపర్ ఫామ్‌లో కాన్వే.. మరో సెంచరీ

image

వెస్టిండీస్‌తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ NZ ఓపెనర్ కాన్వే సెంచరీ చేశారు. 136 బంతుల్లో (8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ మార్క్ అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆయన <<18609470>>డబుల్ సెంచరీ<<>> సాధించారు. దీంతో ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. కాగా ఈ మాజీ CSK ప్లేయర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సంగతి తెలిసిందే.