News August 6, 2024

రేపు చీరాలకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం జాండ్రపేట హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగే చేనేత సదస్సులో ఆయన పాల్గొననున్నారు. నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ సభలో చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

image

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్‌ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.

నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

image

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.