News July 30, 2024

ఆగస్టు 1న సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఆగస్టు 1న సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర(M) గుండుమలలో లబ్ధిదారులకు ఇంటివద్దే పింఛన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టుపురుగుల షెడ్లు పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి, గ్రామస్థులతో మాట్లాడనున్నారు. అదే రోజు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని, ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారు.

Similar News

News November 20, 2025

శబరిమల భక్తులకు అలర్ట్!

image

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.

News November 20, 2025

నేడు సీబీఐ కోర్టుకు జగన్

image

AP: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని YCP నాయకులు భావిస్తున్నారు.

News November 20, 2025

నేడు కార్తీక అమావాస్య! ఇలా చేస్తే..

image

‘కార్తీక అమావాస్య రోజున పితృ దేవతలకు పూజ చేయాలి. దీపదానం, అన్నదానంతో ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి రుద్రాభిషేకం, విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడం శుభకరం. బెల్లం, నువ్వులు నైవేద్యంగా పెట్టాలి. చీమలకు పంచదార ఇస్తే శని దోషాలు పోతాయి. ఉపవాసం ఉంటే కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది’ అని పండితులు సూచిస్తున్నారు.