News October 6, 2024
అభిమాని కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు

AP: క్యాన్సర్ ఫైనల్ స్టేజీలో ఉన్న ఓ అభిమాని ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారు. రేణిగుంటకు చెందిన దివ్యాంగుడు సురేంద్రబాబు(30) క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఒక్కసారైనా చంద్రబాబుతో ఫొటో దిగాలనే కోరికను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో తిరుమల పర్యటన ముగించుకుని రేణిగుంటకు వచ్చిన CM దగ్గరకు సురేంద్రను తీసుకెళ్లారు. CM అతనితో ఫొటో దిగి రూ.5 లక్షల చెక్కును అందించారు.
Similar News
News March 26, 2026
పనస పంటకాలం పూర్తయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పనస చెట్టు కొమ్మలను, రెమ్మలను తొలగించేటప్పుడు కొద్దిగా కొమ్మభాగాన్ని వదలి నరకాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మొగ్గలు దెబ్బతినవు. కాయలను పూర్తిగా తీసేశాక ఎండిన రెమ్మలను తీసివేయాలి. అలాగే కాండం మీద వెలుతురు పడే విధంగా కొమ్మలను కత్తిరించాలి. తర్వాత లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి. తర్వాత నిపుణుల సూచనలతో ఎరువులను వేసి నీటి తడులను అందించాలి.
News March 26, 2026
కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారా?

దిష్టి తగలకూడదని కాళ్లకు నల్ల దారం కట్టుకుంటారు. అయితే మంగళవారం లేదా శనివారం రోజున దాన్ని ధరించడం శుభకరమంటున్నారు పండితులు. పురుషులు కుడి కాలికి, స్త్రీలు ఎడమ కాలికి దీనిని కట్టుకోవాలని సూచిస్తున్నారు. ‘దారానికి తొమ్మిది ముడులు వేయడం ముఖ్యం. నలుపు రంగు ఉన్న చోట వేరే ఇతర రంగు దారాలు ఉండకూడదు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది’ అని చెబుతున్నారు.
News March 26, 2026
బాలయ్యకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారం

టాలీవుడ్ నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ(IFFD) వేడుకల్లో ఆయన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి బాలయ్య చేసిన కృషికి గుర్తింపుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అవార్డుతో సత్కరించారు. ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా ఈ పురస్కారం వరించింది.


