News August 23, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

image

AP: వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. ‘గ్రామాల్లో 10వేల కి.మీ సిమెంట్ డ్రెయిన్లు వేస్తాం. రైతులు పశువుల షెడ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తాం. పేదలకు ఇళ్లు కట్టించి, విద్యుత్, సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటాం. పంచాయతీల అభివృద్ధికి ఇటీవలే రూ.990కోట్లు విడుదల చేశాం. త్వరలో మరో రూ.1100కోట్లు రిలీజ్ చేస్తాం’ అని వానపల్లి గ్రామసభలో CM అన్నారు.

Similar News

News January 20, 2026

జగిత్యాలకు మహర్దశ.. నేడే శంకుస్థాపన

image

జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.235 కోట్లతో నిర్మించనున్న 450 పడకల నూతన ఆసుపత్రికి నేడు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరవుతారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. మాతా శిశు, మెడికల్ కాలేజీ సమీపంలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.

News January 20, 2026

మున్సిపల్ ఎన్నికల వేళ పాలమూరుకు ఇద్దరు మంత్రులు

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బాధ్యతలను మంత్రి దామోదర రాజనరసింహ, నాగర్‌కర్నూల్ బాధ్యతలను మంత్రి వాకిటి శ్రీహరికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఈ మంత్రులు మంగళవారం నుంచే క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.