News October 20, 2024
వ్యక్తి కాళ్లు మొక్కబోయిన సీఎం చంద్రబాబు

AP: అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిన్న సీఎం చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటుండగా ఓ వ్యక్తి ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో చంద్రబాబు కూడా ఆ వ్యక్తి కాళ్లను పట్టుకునేందుకు కొంచెం నడుము ఒంచారు. దీంతో అతను కంగుతిన్నాడు. తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కరించాలని, తన కాళ్లకు మొక్కితే తాను అలాగే చేస్తానని ఇటీవల CBN చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News January 29, 2026
విజయ్ బూస్ట్ మాకు అవసరం లేదు: తమిళనాడు కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తామంటూ TVK అధినేత విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై సెటైర్లు వేశారు. ‘విజయ్ నుంచి మాకు బూస్ట్ అవసరం లేదు. మా క్యాడర్ను చూడండి. వారు ఇప్పటికే బూస్ట్తో ఉన్నారు. మా నేత రాహుల్ గాంధీ అవసరమైన బూస్ట్, హార్లిక్స్, బోర్న్వీటా ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ కామెంట్లపై విజయ్, TVK ఇంకా స్పందించలేదు.
News January 29, 2026
‘ఫేర్వెల్ సాంగ్’.. నా మరణానంతరమే రిలీజ్: జాకీ చాన్

కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్ తన అభిమానులతో ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన మరణం తర్వాతే విడుదల చేయాలని ఒక ప్రత్యేక పాట రికార్డ్ చేయించుకున్నట్లు తెలిపారు. బీజింగ్లో జరిగిన తన కొత్త సినిమా వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ పాట ప్రపంచానికి తానిచ్చే చివరి సందేశమని ఆయన తెలిపారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో భద్రపరిచి, అభిమానులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 29, 2026
నేతన్నలకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్

AP: మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్ (మగ్గం)కు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ద్వారా 4 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.


