News July 13, 2024

సీఎం చంద్రబాబుది రాక్షసానందం: కాకాణి

image

AP: వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ సీఎం చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ సీఎం జగన్‌పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట సంప్రదాయం అనుసరిస్తున్నారు. మరోవైపు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసాలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News April 2, 2026

IPL: కోర్టుకెక్కిన RCB ప్లేయర్!

image

IPLలో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వలేదని శ్రీలంక క్రికెట్ బోర్డుపై నువాన్ తుషారా(RCB) కోర్టుకెక్కారు. తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వలేదని, IPLలో ఆడేందుకు క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొలంబో జిల్లా కోర్టులో కేసు వేశారు. ఈ నెల 9న కోర్టు దీన్ని విచారించనున్నట్లు తెలుస్తోంది. విదేశీ T20 లీగ్స్‌లో ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ ప్రమాణాలను తుషారా అందుకోలేకపోవడంతోనే NOC ఇవ్వలేదని సమాచారం.

News April 2, 2026

రాముడి పాత్రకు తొలుత నో చెప్పిన రణ్‌బీర్.. కారణమిదే

image

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాలో రాముడి పాత్ర పోషించేందుకు తొలుత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నో చెప్పారట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాముడి పాత్రకు తాను సరిపోనని, దానికి పూర్తి న్యాయం చేయలేనని భావించినట్లు తెలిపారు. అయితే బిడ్డకు తండ్రయ్యాక రాముడి పాత్ర చేయాలనిపించిందని పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం స్మోకింగ్, నాన్ వెజ్ మానేశానని వివరించారు.

News April 2, 2026

పిల్లలను బేబీ వాకర్‌తో నడిపిస్తున్నారా?

image

పిల్లలు త్వరగా నడవాలని చాలామంది పేరెంట్స్ బేబీ వాకర్‌లో ఎక్కువసేపు కూర్చోబెడతారు. కానీ దీనివల్ల లాభాల కంటే.. నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎక్కువగా బేబీవాకర్‌లో ఉండటం వల్ల చిన్నారుల వెన్నెముక వంకరగా మారుతుందని చెబుతున్నారు. అలాగే దీనివల్ల కాళ్లు దూరంగా పెట్టి నడవడం అలవాటవుతుంది. బిడ్డ తనంతట తానుగా లేచి నడిస్తే మంచి సమతుల్యత ఉంటుంది. కాబట్టి వాకర్స్‌ వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు.