News September 17, 2024

నేడు సమీక్షలతో బిజీగా సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Similar News

News December 1, 2025

68 ఏళ్ల ఏకగ్రీవానికి ముగింపు.. తెల్దారుపల్లిలో ఈసారి ఎన్నికల్లేవ్

image

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైంది. దాదాపు 68 ఏళ్లుగా (1957 నుంచి) 13 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుని, కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిన ఈ గ్రామం చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనడం లేదు. తెల్దారుపల్లి ఇటీవల ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైందని అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో ఈసారి ఎన్నికల సందడి కనిపించడం లేదు.

News December 1, 2025

నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి MBNRలోని మక్తల్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

News December 1, 2025

ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

image

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్‌లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.