News August 15, 2024
జనాభా తగ్గుదలపై సీఎం చంద్రబాబు ఆందోళన
AP: జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో CM చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈమధ్య ఒకే బిడ్డను కనాలనుకుంటున్నారు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ముసలివాళ్లు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీని వల్ల సంపాదన కూడా తగ్గుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News January 15, 2025
రేపు ఈడీ విచారణకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.
News January 15, 2025
దేశంలో ఎన్నో సమస్యలుంటే.. సైకిల్ ట్రాక్లు కావాలా?: సుప్రీంకోర్టు
‘దేశంలో పేదలకు సరైన నివాస వసతి లేదు. మురికివాడల్లో నివసిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవల కొరత ఉంది. ప్రభుత్వాలు వీటి కోసం నిధులు ఖర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్ల కోసమా?’ అని SC ప్రశ్నించింది. దేశంలో సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలన్న పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామని SC ప్రశ్నించింది.
News January 15, 2025
భారత్ ఘన విజయం
ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది.