News August 29, 2024
మంకీపాక్స్ RT-PCR కిట్‌ను లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

AP: దేశంలో తయారైన తొలి మంకీపాక్స్ RT-PCR కిట్‌ను లాంచ్ చేయడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్‌జోన్‌లో ఈ కిట్‌ను లాంచ్ చేశారు. కిట్‌ను తయారు చేసిన AMTZ, ట్రాన్సాసియా డయాగ్నస్టిక్ బృందాలను అభినందించారు. దీనిని ICMR, CDSCO ధ్రువీకరించాయని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై ‘మేక్ ఇన్ ఏపీ’ కార్యక్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.
Similar News
News January 20, 2026
విద్యార్థులు రోగాల బారిన పడకుండా కమిటీలు

AP: హాస్టళ్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా 9 శాఖల అధికారులతో జిల్లాల్లో JACలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైద్య, ఫుడ్ సేఫ్టీ, పంచాయతీ, మున్సిపల్, పశు సంవర్ధక, వ్యవసాయ, సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల, విద్యా శాఖల అధికారులతో వీటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కాగా JACల తనిఖీలు నివేదికలకే పరిమితం కారాదని, లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
News January 20, 2026
ఇతిహాసాలు క్విజ్ – 129 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
సమాధానం: రావణుడి సోదరి అయిన శూర్పణఖ అసలు పేరు మీనాక్షి. చేప వంటి కళ్లు గలది అని దీనర్థం. అయితే ఆమె గోళ్లు పెద్దవిగా ఉండేవి. అలాగే పదునుగా కూడా ఉండేవి. అందువల్లే ఆమెను ‘శూర్పణఖ’ అని పిలవడం మొదలుపెట్టారు. శూర్పణఖ అంటే జల్లెడ వంటి గోళ్లు కలది అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 20, 2026
హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. నిండుగర్భంతో బ్లాక్ డ్రెస్సులో తాజాగా ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సోనమ్ 2018లో ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే వాయు అనే కుమారుడు ఉన్నారు. 2007లో ‘సావరియా’తో తెరంగేట్రం చేసిన ఆమె భాగ్ మిల్కా భాగ్, నీర్జా, పాడ్ మ్యాన్, ది జోయా ఫ్యాక్టర్ వంటి సినిమాల్లో నటించారు.


