News July 16, 2024

ఢిల్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని చంద్రబాబు మంత్రులతో చెప్పారు. రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Similar News

News November 9, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

✦ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు 35 గంటల్లో 53+ మిలియన్ వ్యూస్
✦ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా నుంచి ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసే అవకాశం: సినీ వర్గాలు
✦ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘దురంధర్’ సినిమా నుంచి మాధవన్ పోస్టర్ విడుదల.. బట్టతలతో గుర్తుపట్టలేని విధంగా లుక్
✦ సుధీర్ బాబు ‘జటాధర’ సినిమాకు 2 రోజుల్లో రూ.2.91కోట్ల కలెక్షన్స్

News November 9, 2025

అవనీ లేఖరాకు మరో స్వర్ణం

image

2025 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో షూటింగ్‌లో అవని లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణం సాధించారు. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె తర్వాత షూటింగ్‌కు మళ్లారు. రెండు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారాఅథ్లెట్‌గా కీర్తి గడించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు అవని.

News November 9, 2025

ఆడపిల్ల పెళ్లికి రూ.65వేల సాయం: యోగి

image

యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కన్యా వివాహ్ సహాయతా యోజన’ కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి రూ.65వేలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి రూ.75వేలు, సామూహిక వివాహాలకు రూ.85వేలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు రూ.15వేలు అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు.