News October 29, 2024
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగం, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో సీఎం చర్చిస్తున్నారు. కాగా వచ్చే నెల 6న క్యాబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ పోలింగ్ అప్డేట్స్

✦ మ.3 గంటల వరకు 40.20% ఓటింగ్ నమోదు.. సా.6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
✦ కాంగ్రెస్ నేతలు నగదు పంచుతూ ఓటర్లను భయపెడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న వారి సంగతి 14వ తేదీన చెప్తా: మాగంటి సునీత
✦ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఆచరించేది కాంగ్రెస్.. ఓడిపోతున్నామని అసహనంతో BRS అభ్యర్థి మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం
News November 11, 2025
వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it
News November 11, 2025
కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే..

కనురెప్పలు ఒత్తుగా ఉంటే ముఖం అందంగా ఉంటుంది. దీనికోసం కొన్ని సహజ చిట్కాలు..* రాత్రి పడుకొనే ముందు ఒక చుక్క ఆముదాన్ని కనురెప్పలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. * గ్రీన్‌టీలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కనురెప్పలు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి. గ్రీన్‌టీలో దూది ఉండను ముంచి కనురెప్పలపై అద్దాలి. ఇలా వారానికోసారి చెయ్యాలి. అయితే కనురెప్పలకు ఏవి రాసినా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కంట్లోకి వెళ్లి ఇబ్బంది పెడతాయి.


