News July 26, 2024
NDB ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

AP: అమరావతిలోని సచివాలయంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ DJ పాండియన్ బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. CRDA పరిధిలో మౌలిక వసతులకు ఆర్థికసాయం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానంపై వారితో చర్చించారు. పోర్టులు, గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
Similar News
News December 13, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.
News December 13, 2025
జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.
News December 13, 2025
పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


