News August 18, 2024

షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ.. వివరాలివే

image

AP: ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మల, సీఆర్‌ పాటిల్‌తో CM చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంఓ వివరాల ప్రకారం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించాలని ఆయన షా‌ను కోరారు. రాజధాని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల్ని విడుదల, పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంశాలపై నిర్మల, సీఆర్ పాటిల్‌తో ఆయన చర్చించినట్లు CMO తెలిపింది.

Similar News

News December 6, 2025

స్ఫూర్తిని రగిలించే డా.అంబేడ్కర్ మాటలు

image

➛ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
➛ మేకల్ని బలి ఇస్తారు. పులుల్ని కాదు. పులుల్లా బతకండి
➛ మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే
➛ ప్రజలకు ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది
➛ విశ్వాసం కలిగి ఉండండి. ఆశను కోల్పోకండి
* ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి *

News December 6, 2025

చిన్న చీమ పెద్ద మనసు.. చావడానికీ వెనుకాడదు!

image

కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. తీవ్రంగా జబ్బుపడిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాయని ఆస్ట్రియా పరిశోధకుల స్టడీలో తేలింది. అనారోగ్యానికి గురైనవి రసాయన వాయువు రిలీజ్ చేసి ‘డేంజర్’, ‘నన్ను చంపండి’ అనే సిగ్నల్‌ ఇస్తాయని సైంటిస్టులు చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు.

News December 6, 2025

గ్రీవ్స్ డబుల్ సెంచరీ.. NZ-WI తొలి టెస్టు డ్రా

image

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 531 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 72కే 4 వికెట్లు పడినా జస్టిన్ గ్రీవ్స్(202*) అద్భుత పోరాటం చేశారు. షాయ్ హోప్(140), కీమర్ రోచ్‌(58*)తో కలిసి న్యూజిలాండ్‌కు చుక్కలు చూపెట్టారు. దాదాపు గెలిపించినంత పని చేశారు. కానీ 5వ రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్కోర్లు: ఫస్ట్ ఇన్నింగ్స్: NZ-231/10, WI-167/10, సెకండ్ ఇన్నింగ్స్: NZ-466/8D, 457/6.