News October 9, 2024

కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమార స్వామి, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. విశాఖ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉన్న అవకాశాలపై కుమారస్వామితో చర్చించినట్లు తెలిపారు. YCP పాలనలో నాశనమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్-2047 డాక్యుమెంట్ తయారుచేస్తున్నామని చెప్పారు.

Similar News

News November 25, 2025

ఎన్పీడీసీఎల్‌లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

image

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్‌కు, రమేష్ వైరా డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.

News November 25, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.

News November 25, 2025

దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

image

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్‌ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.