News December 14, 2024

అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

image

అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆరా తీసి పరామర్శించారు. ఈ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్‌కు సూచించారు. కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలని భరోసా నింపారు.

Similar News

News December 9, 2025

ఎంజీఎంలో టెండర్లు ఉండవా ?

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుత్తేదారులతో హవా నడుస్తోంది. కాల పరిమితి ముగిసినా టెండర్లు పిలవకపోవడంతో పాత కాంట్రాక్టు సంస్థలకే కట్టబెడుతున్నారు. శానిటేషన్ టెండర్ ముగిసినా గత 3 నెలలుగా వారితోనే సిబ్బంది వేతనాలు కోతలతో చెల్లిస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్టేషనరీ, సర్జికల్, మెడికల్ టెండర్లు పిలవకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

News December 9, 2025

క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

image

విండీస్ ఆల్‌రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.

News December 9, 2025

డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

image

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.