News March 17, 2025

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

Similar News

News October 22, 2025

గుడ్ న్యూస్.. ట్రేడ్ డీల్‌ దిశగా ఇండియా, అమెరికా

image

భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అతి త్వరలోనే కుదిరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఒకవేళ ఒప్పందం కుదిరితే ప్రస్తుతం 50 శాతంగా ఉన్న టారిఫ్స్ 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి <<18044575>>పీయూష్ <<>>గోయల్ చెప్పిన విషయం తెలిసిందే.

News October 22, 2025

WWC: పాక్ ఔట్.. భారత్‌లోనే సెమీస్, ఫైనల్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్‌/ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.

News October 22, 2025

నేడు బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడట

image

నేటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెలలో వచ్చే తొలి తిథిని బలి పాడ్యమి అంటారు. ఈ శుభదినాన బలి చక్రవర్తి భూలోకాన్ని చూడ్డానికి భూమ్మీదకు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పుడు ప్రతి ఏడాది 3 రోజులు భూలోకాన్ని పాలించే వరం ఇస్తాడు. ఆ 3 రోజుల్లో ఇదొకటి. నేడు దాన గుణుడైన బలిని స్మరిస్తూ, భక్తులు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి, దానధర్మాలు చేస్తారు.