News August 22, 2025

నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ!

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. మ.2 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 3.15 గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ డా.అరవింద్ పనగడియాతో సమావేశమవుతారు. సా.5 గంటలకు వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర సాంకేతికశాఖ కార్యదర్శి అభయ్ కరందికర్‌ను కలిసి వివిధ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

Similar News

News August 22, 2025

చిరంజీవికి నారా లోకేశ్, అల్లు అర్జున్ విషెస్

image

మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు <<17480281>>శుభాకాంక్షలు<<>> వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమా, సమాజానికి మీరు చేసిన అద్భుతమైన కృషి గర్వకారణం, స్ఫూర్తిదాయకం’ అని మంత్రి లోకేశ్, ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ హీరోలు, దర్శకులు విషెస్ తెలియజేస్తున్నారు.

News August 22, 2025

ప్రకాశ్ రాజ్ ట్వీట్ చంద్రబాబు, పవన్ గురించేనా?

image

క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30రోజులు జైల్లో ఉంటే PM, CMల పదవి పోయేలా కేంద్రం <<17465755>>కొత్త బిల్లును<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తనకో చిలిపి సందేహం కలిగిందని నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ‘మాజీ సీఎం కానీ ప్రస్తుత CM కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని” CM చేసే కుట్ర ఏమైనా ఉందా?’ అని ప్రశ్నించారు. ఆయన ఈ ట్వీట్‌ను తెలుగులో చేయడంతో ఇది AP గురించేనని చర్చ మొదలైంది.

News August 22, 2025

గోడ దూకి పార్లమెంటు భవనంలోకి..

image

ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గోడ దూకి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. ఈ ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.