News April 9, 2025

సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి భూమిపూజ

image

AP: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తన కొత్త ఇంటికి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక వైపు E-9 రోడ్ పక్కన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ+1 పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సీఎం కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొన్న విషయం తెలిసిందే.

Similar News

News December 29, 2025

‘ఆరావళి’పై రేపు సుప్రీంలో విచారణ

image

<<18663286>>ఆరావళి పర్వతాల<<>> నిర్వచనంపై చెలరేగిన వివాదాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. ఆరావళి కొండలు, శ్రేణుల నిర్వచనం, అనుబంధ సమస్యల వివాదంపై ముఖ్యంగా విచారణ జరగనుంది. కాగా ఆరావళిలో మైనింగ్‌ <<18662201>>నిలిపివేస్తున్నట్లు<<>> కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

News December 28, 2025

భారత్ ఖాతాలో మరో విజయం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న 5 T20ల సిరీస్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన 4వ T20లో IND 30 రన్స్ తేడాతో గెలిచింది. 222 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన SL 20 ఓవర్లలో 191/6 రన్స్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ఆటపట్టు(52), పెరెరా(33) దూకుడుగా ఆడినా వారు ఔటయ్యాక రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమిపాలైంది. IND బౌలర్లలో అరుంధతి, వైష్ణవి చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో IND 4-0 లీడ్ సాధించింది.

News December 28, 2025

బ్యాడ్మింటన్‌లో గోల్డ్ సాధించిన చరిష్మ.. CBN, లోకేశ్ అభినందనలు

image

AP: విజయవాడలో జరిగిన 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2025 ఉమెన్స్ సింగిల్స్‌లో రాష్ట్రానికి చెందిన సూర్య చరిష్మ తమిరి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రా జట్టు సిల్వర్ గెలిచింది. తొలి గోల్డ్ మెడల్ సాధించిన చరిష్మ, సిల్వర్ గెలిచిన టీమ్‌ను CM చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.