News December 24, 2024

ఢిల్లీ బయలుదేరిన సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీయే సీఎంల సమావేశంతో పాటు వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీలోని నడ్డా నివాసంలో రేపు ఎన్డీయే కూటమి నేతలు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివాదాస్పదమైన పలు అంశాలు, బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

Similar News

News December 25, 2024

మరోసారి కిమ్స్‌కు వెళ్లనున్న సుకుమార్, దిల్ రాజు?

image

కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్, దిల్ రాజుతో కలిసి ఇవాళ మరోసారి పరామర్శిస్తారని తెలుస్తోంది. మ.2 గంటలకు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీతేజ్ కుటుంబానికి సాయంపై బాలుడి తండ్రి భాస్కర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రేవతి భర్తకు దిల్ రాజు ఉద్యోగ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News December 25, 2024

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. పోలీసుల వార్నింగ్

image

TG: సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు వీడియోలు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని HYD పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని తెలిపారు. విచారణ సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News December 25, 2024

అల్లు అర్జున్ కేసు: AP vs TG రంగు కరెక్టేనా?

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంటోంది. కేసులో ప్రధాన నిందితులపై కాకుండా A11 అల్లు అర్జున్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అర్జున్ VS పోలీసులు, అర్జున్ VS రేవంత్‌గా కొనసాగిన నెరేటివ్ ఇప్పుడు AP VS TGగా మారింది. కొందరు కాంగ్రెస్ నేతలు, MLAలు ఆంధ్రావాళ్ల పెత్తనం ఇక్కడేంది? కావాలంటే వెళ్లిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆ పార్టీ వైఖరిపై సందేహాలు కలుగుతున్నాయి. మరి మీరేమంటారు?