News January 1, 2025

GOOD NEWS చెప్పిన సీఎం చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) కింద రూ.24 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నూతన సంవత్సరంలో ఈ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. దీంతో దాదాపు 1,600 మంది పేదలకు సాయం అందనుంది. త్వరలోనే లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు చెక్కులను అందజేయనున్నారు. గత ఏడాది అధికారం చేపట్టినప్పటి నుంచి DEC 31 వరకు రూ.100 కోట్లకు పైగా CMRF నిధులు పేదవర్గాలకు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

Similar News

News January 5, 2026

ఒత్తిడిని వదిలి ఊరి బాట పడదాం పదండి!

image

ఉరుకుల పరుగుల జీవితంలో పడి కన్నవారిని, సొంతూరిని మర్చిపోతున్నాం. ఏడాదంతా బిజీగా ఉండే మనకు పండుగలే కాస్త ఉపశమనాన్నిస్తాయి. అందుకే పండుగలకైనా పట్నం వదిలి పల్లెబాట పట్టండి. తల్లిదండ్రులతో గడిపే ఆ కాస్త సమయం వారికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలనిస్తుంది. ఆత్మీయుల మధ్య సందడిగా గడపండి. కుటుంబానికి మనం ఇచ్చే ఖరీదైన కానుక వారితో గడిపే సమయమే. మరింకేం ఈ సంక్రాంతితోనే దీనిని స్టార్ట్ చేద్దామా?

News January 5, 2026

వరి మాగాణి మినుములో తుప్పు లేదా కుంకుమ తెగులు

image

మినుము పూత దశ నుంచి తుప్పు తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి. తర్వాత ఇవి కుంభాకారంలో గుండ్రని మచ్చలుగా మారి కుంకుమ/తుప్పు రంగులో కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ + 1 మి.లీ. డైనోకాప్(లీటరు నీటికి) లేదా లీటరు నీటికి బైలాటాన్‌ 1గ్రా కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి.

News January 5, 2026

వాల్‌నట్స్ వీరు తినకూడదు

image

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మెదడు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు, రక్తస్రావ రుగ్మతలు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, మూత్రపిండాల్లో రాళ్లున్నవారు, శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్లు ఇవి తీసుకోకూడదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.