News December 24, 2024
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తారు. రేపు రాత్రి అమరావతికి తిరిగొస్తారు.
Similar News
News January 8, 2026
KNR: ‘బీసీ సబ్‌ప్లాన్ నిధులను విడుదల చేయాలి’

బీసీ సబ్‌ప్లాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు గంగిపెళ్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా ఉన్నారు.
News January 8, 2026
ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.
News January 8, 2026
ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా.. నోబెల్ ఇవ్వరా: ట్రంప్

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నార్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా. నాటో సభ్య దేశమైన నార్వే నన్ను నోబెల్‌కు ఎంపిక చేయకుండా ఫూలిష్‌గా వ్యవహరించింది. అయినా నోబెల్ నాకు మ్యాటర్ కాదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను. అది చాలు’ అని ట్వీట్ చేశారు. అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని.. రష్యా, చైనాలు దాన్ని లెక్కచేయవని స్పష్టం చేశారు.


