News January 31, 2025
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి అక్కడి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో తెలుగు అసోసియేషన్స్, తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం ఆయన అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.
Similar News
News December 4, 2025
SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.
News December 4, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
News December 4, 2025
క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్: భట్టి

TG: క్వాంటం ఎకానమీ లీడర్ కావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ స్కిల్స్ హైదరాబాద్‌లో ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్ సహా తదితర అంశాలపై దృష్టిసారించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.


