News August 17, 2025
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 20న జరిగే NDA నేతల భేటీ, 21న ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఇవాళ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయనుంది. భేటీ అనంతరం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
Similar News
News August 18, 2025
సినిమా ఛాన్స్‌ల కోసం మణిరత్నం వెంటపడ్డా: నాగార్జున

కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించే కథలకు తాను సరిపోతానని భావించి ఆయన వెంటపడేవాడినని సినీ నటుడు నాగార్జున తెలిపారు. అలా మా కాంబోలో వచ్చిందే ‘గీతాంజలి’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నాగేశ్వరరావు కొడుకుగానే తొలి ఆరేడు సినిమాలు చేశా. ఇది కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. మజ్ను సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆఖరి పోరాటంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నా’ అని నాగ్ చెప్పుకొచ్చారు.
News August 18, 2025
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్

ఒడిశా మాజీ సీఎం, BJD నేత నవీన్ పట్నాయక్ (78) ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం నవీన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా నవీన్ ఇటీవల ముంబైలో సర్వికల్ ఆర్థరైటిస్‌కు సర్జరీ చేయించుకున్నారు.
News August 18, 2025
ఆగస్టు 18: చరిత్రలో ఈరోజు

1227: మంగోలియా చక్రవర్తి చెంఘీజ్ ఖాన్ మరణం
1650: స్వాతంత్ర్యోద్యమకారుడు సర్వాయి పాపన్న జననం
1868: గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసి హీలియం ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త పియర్ జూల్స్ జాన్సెన్
1945: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(ఫొటోలో)మరణం
1959: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జననం
1980: సినీ నటి ప్రీతి జింగానియా జననం
2011: ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం