News February 20, 2025

నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: CM చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉ.9 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి CR పాటిల్‌తో సమావేశమై పోలవరానికి ఆర్థిక సాయంపై చర్చిస్తారు. 11 గంటలకు ఢిల్లీ CM రేఖా గుప్తా ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షా‌తో భేటీ అయి పలు అంశాలపై మాట్లాడతారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరిస్తారు. రాత్రికి అమరావతికి తిరిగొస్తారు.

Similar News

News November 10, 2025

JE, SI పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన SSC

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) జూనియర్ ఇంజినీర్, SI పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్స్ డిసెంబర్ 3 నుంచి 6 వరకు, ఎస్సై పోస్టులకు డిసెంబర్ 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. JE సెల్ఫ్ స్లాట్ సెలక్షన్ నవంబర్ 10 నుంచి 13వరకు, ఎస్సై పోస్టులకు NOV 17 నుంచి 21వరకు ఎంపిక చేసుకోవచ్చు. SI పోస్టులు 3,073 ఉండగా, జూనియర్ ఇంజినీర్ పోస్టులు 1731 ఉన్నాయి.

News November 10, 2025

వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు: గంభీర్

image

హెడ్ కోచ్‌గా తనకు జట్టు ప్రదర్శనే ముఖ్యమని గంభీర్ తెలిపారు. ‘క్రికెట్ వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించింది కాదని నమ్ముతాను. మేము ODI సిరీస్ ఓడిపోయాం. కోచ్‌గా ఇండివిడ్యువల్ గేమ్‌ను మెచ్చుకోవచ్చు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా సిరీస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోలేను. T20 సిరీస్‌‌ వేరే.. అందులో గెలిచాం. దానిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ WCకి ముందు మేమనుకున్న చోట లేము’ అని తెలిపారు.

News November 10, 2025

₹750 కోట్లతో నేచురోపతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్: మంత్రి

image

AP: తొలిసారిగా ‘అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ రాష్ట్రంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ₹750 కోట్లతో కేంద్రం నెలకొల్పే దీనిలో బ్యాచ్‌లర్ ఆఫ్ నేచురోపతి యోగా సర్జరీలో 100 సీట్లు, PGలో 20 సీట్ల చొప్పున తొలి ఏడాదిలో ఉంటాయన్నారు. దీనికోసం 40 ఎకరాలు కావాలని కేంద్రం లేఖ రాసిందని చెప్పారు. 450 పడకల నేచురోపతి ఆసుపత్రీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.